విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్ కేసులో శాఖా పరమైన విచారణ పూర్తైందన్న సీపీ తిరమలరావు... ఆ సమయంలో ఠాణాలో విధులు నిర్వహించిన ఏఎస్సై నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వి.సాంబశివరావు, కానిస్టేబుల్ నాగమల్లేశ్వరీను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య... పోలీసులపై సస్పెన్షన్ వేటు - విజయవాడ
లాకప్ డెత్ కేసులో శాఖా పరమైన విచారణ పూర్తైది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని దర్యాప్తులో తేల్చారు.
పోలీసుల నిర్లక్ష్యమే యువకుడి ఆత్మహత్యకు కారణం