విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నగర పోలీసు కుటుంబాల తరఫున పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సారె సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు, పట్టువస్త్రాలతో సారెను అందజేశారు. సీపీతో పాటు ఇతర పోలీసు అధికారులు, కుటుంబసభ్యులతో కలిసి పరిమిత సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
దుర్గమ్మకు సారె సమర్పించిన విజయవాడ పోలీసులు
బెడవాడ దుర్గమ్మకు నగర పోలీసు కుటుంబాలు సారె సమర్పించారు. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు.. కుటుంబసభ్యులతో కలిసి.. అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలతో సారె సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అమ్మవారిని వేడుకున్నట్లు సీపీ తెలిపారు.
బెడవాడ దుర్గమ్మకు సారె సమర్పించిన పోలీసులు
దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు.. పోలీసు కుటుంబాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలిగి అంతా సుఖసంతోషాలతో ఉండాలని జగన్మాత దుర్గమ్మను కోరుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి :అక్రమ నగదు తరలింపు... మంత్రి బాలినేని చుట్టూ వివాదం