కరోనా ప్రభావంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది. థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ సూచనలు మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప బయటకురావటం లేదు. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్ మూతపడటం వల్ల కార్మికుల జీవనోపాధిపై ప్రభావం పడింది. ప్రయాణికులు లేక రవాణా రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీస ఖర్చులూ రావడంలేదని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. రోజుకు కనీసం రూ.200 సంపాదన రావడం లేదంటున్నారు. ప్రభుత్వం కరోనా ప్రభావాన్ని తగ్గించేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని... ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.
కరోనా ఎఫెక్ట్: విజయవాడలో కార్మికులకు కష్టాలు
వివిధ పనుల మీద విజయవాడకు వచ్చే వారితో రద్దీగా ఉండే నగర వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రయాణాలు తగ్గించుకున్నారు. ఈ ప్రభావం ఆటో కార్మికులు, రోజువారి కూలీలపై పడింది. కనీస ఖర్చులు రావటంలేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్ : విజయవాడ రోడ్లు ఖాళీ.. కార్మికులకు ఉపాధి కష్టాలు