సీఎం జగన్ తాను 16నెలలు జైలు శిక్ష అనుభవించిన కోపంతో ప్రజలు, తెదేపా నాయకులపై ఇనుప పాదం మోపుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. దళితులంటే ఎందుకంత ద్వేషమో అర్థం కావట్లేదన్నారు. పైనుంచి ఆదేశాలు లేకుండా కానిస్టేబుళ్లు రైతులకు బేడీలు వేయరన్న వర్ల.. ఘటనకు ప్రేరేపించినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల బెయిల్ పిటిషన్పై జరిగే వాదనలను అడ్డుకోకూడదని వర్ల రామయ్య హితవు పలికారు.
ప్రజలపైకి పోలీస్ వ్యవస్థను ఉసి గొలుపుతున్నారు: వర్ల రామయ్య - తెదేపా నేతల అరెస్టుపై వర్ల రామయ్య కామెంట్స్
ప్రజలపైకి పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఉసిగొలుపుతున్నారని తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. కేసుల విచారణ సాగుతున్నందున ముఖ్యమంత్రి రాజకీయ భవిష్యత్.. ఎటు వెళ్తుందోనన్నారు.
ప్రజలపైకి పోలీస్ వ్యవస్థను ఉసిగొలుపుతున్నారు: వర్ల