ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పేర్ని నానిపై దాడిలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందనడానికి ఆధారాలేంటి' - పేర్ని నానిపై దాడి కేసులో కొల్లు రవీంద్ర విచారణ న్యూస్

మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడిలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందనడానికి పోలీసుల వద్ద ఏ ఆధారాలున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంత్రి వెంట ఉన్న వ్యక్తే ఆయనపై దాడి చేశారని ఆరోపించారు.

'పేర్ని నానిపై దాడిలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందనడానికి ఆధారాలేంటి'
'పేర్ని నానిపై దాడిలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందనడానికి ఆధారాలేంటి'

By

Published : Dec 5, 2020, 7:27 PM IST

మంత్రి పేర్ని నానిపై దాడి విషయంలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందనడానికి ఆధారాలేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపాలని సూచించారు. కొల్లు రవీంద్ర ప్రమేయం లేకున్నా పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మనడమేంటని మండిపడ్డారు. దాడి చేసింది తెదేపా కార్యకర్తే అయితే.. మంత్రి వెంట ఎలా తిరుగుతాడని ప్రశ్నించారు. ఎవరినో సంతోషపెట్టేందుకు కొల్లు రవీంద్రను విచారించాలనే అత్యుత్సాహం పోలీసులకు తగదని హితవు పలికారు. అధికారులను జైలుకు తీసుకెళ్లే అలవాటున్న జగన్ నైజాన్ని గుర్తించాలన్న వర్ల రామయ్య.. పలువురు ఐఏఎస్​లు ఇప్పటికీ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details