శిక్షణ పూర్తి చేసుకొని కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎస్సైకి శిరోముండనం చేయాలన్న ఆలోచన రాదని, ఎస్సైని ఎవరో ప్రలోభపెట్టి, రెచ్చగొట్టారని.. వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా, అసలు ముద్దాయిలను వదిలిపెట్టారని లేఖలో ప్రస్తావించారు. దళిత యువతకు న్యాయం చేయాలని వర్ల కోరారు. బాధితుడు రాష్ట్రపతి కి లేఖ రాయడంలో తీవ్రత గుర్తించాలని పేర్కొన్నారు.
శిరోముండన కేసుపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
శిరోముండన కేసు దర్యాప్తు వ్యక్తిగతంగా సమీక్ష చేయాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఎస్సైని ఎవరో రెచ్చగొట్టారని ఆరోపించారు.
varla letter to dgp over tonsure incident