108 కుంభకోణంపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 108 వాహనాల కొనుగోలులో 307 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినా.. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వాటిని జెండా ఊపి ఎలా ప్రారంభిస్తారని జగన్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షం ఆరోపణలు చేసిన వెంటనే విచారణకు అదేశించాల్సింది పోయి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రం మీకు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా?: వర్ల రామయ్య
అనుభవం లేని అరబిందో సంస్థకి 108 నిర్వహణ బాధ్యతలు ఎలా ఇస్తారని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. 108 కుంభకోణంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబులెన్స్‌లు కొన్నది ప్రజల ఆరోగ్యం కోసం కాదని.. అరబిందో సంస్థకు డబ్బు అందించేందుకని వర్ల రామయ్య ఆరోపించారు.
రాష్ట్రం మీకు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా: వర్ల రామయ్య
అనుభవం లేని అరబిందో సంస్థకి 108 నిర్వహణ బాధ్యతలు ఎలా ఇస్తారని మండిపడ్డారు. రాష్ట్రం ఏమైనా జగన్, విజయ సాయిరెడ్డిలకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని ప్రశ్నించారు. అంబులెన్స్‌లు కొన్నది ప్రజల ఆరోగ్యం కోసం కాదని.. అరబిందో సంస్థకు డబ్బు అందించేందుకని వర్ల ఆరోపించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు