ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​కు వర్ల బహిరంగ లేఖ.. ఏముందంటే! - varla ramayya latest news

వివేకా హత్య గురించి రాష్ట్రమంతా కోడై కూస్తుంటే.. జగన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. తూతూ మంత్రంగా ఎవరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ చార్జిషీటుతో ఏకీభవిస్తున్నారా? అంటూ.. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

varla attack on jagan on viveka murder
varla attack on jagan on viveka murder

By

Published : Oct 29, 2021, 8:40 PM IST

బాబాయిని ఎవరు చంపారని రాష్ట్రమంతా కోడై కూస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. బాబాయ్ హత్యకేసు దర్యాప్తును.. ఎవరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ చార్జిషీటును అంగీకరిస్తున్నారా? అంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. హత్య వెనుక చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని ఆరోపణలు చేయటంతోపాటు హైకోర్టులో సీబీఐ దర్యాప్తునకు పిటిషన్ వేసి, మళ్లీ ఎందుకు ఉపసంహరించుకున్నారని వర్లరామయ్య ప్రశ్నించారు.

దీనిపై సీఎంను సీబీఐ విచారించిందా? అని నిలదీశారు. ఇంటిదొంగలు బయటపడతారని నిద్రలేని రాత్రులు గడపలేదా? అని మండిపడ్డారు. సీబీఐ తన చార్జిషీట్ తో ఇంటిదొంగల్ని రక్షించినట్లేనా? అని ప్రశ్నించారు. వివేకా హత్య తర్వాత తన కుటుంబం రెండుగా చీలిపోయింది నిజం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌, ఆయన భార్య ఒకవైపు.. ఆయన తల్లి, చెల్లి మరోవైపు ఉన్నారని పులివెందులలో ప్రచారం జరుగుతోందని అన్నారు.

సీబీఐ ఎవరి ప్రలోభాలకో లొంగిపోలేదని చాటేందుకు.. హత్యను ప్రేరేపించిన పెద్దల పేర్లు రాష్ట్రప్రజల ముందుంచాల్సిందేనని వర్ల డిమాండ్‌చేశారు. దర్యాప్తు వివరాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని స్పష్టంచేశారు. సీఎంగా జగన్‌ కేంద్రాన్ని సమగ్ర విచారణ కోరకుంటే.. అసలు దొంగలు అదృశ్యంగానే ఉండే ప్రమాదం ఉందని వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:TDP Leade Brahmam Case: మంగళగిరి కోర్టు వివరణపై హైకోర్టు అసంతృప్తి.. జిల్లా జడ్జికి ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details