ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ బిల్లుకు వైకాపా, తెదేపాలు పోటీపడి మద్దతిస్తున్నాయి' - vadde sobhanadreeswara rao comments on ycp

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను.. ఎన్డీయేలోని భాగస్వాములే వ్యతిరేకిస్తుంటే వైకాపా, తెదేపాలు పోటీపడి మరీ మద్దతు ఇవ్వడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఈ పార్టీలు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు. ఈనెల 25న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.

vadde sobhanadreeswara rao fires on TDP and YCP Over bills support
మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

By

Published : Sep 18, 2020, 7:48 PM IST

కేంద్రం ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న మంత్రులే... రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగించే బిల్లులను తెచ్చినందుకు పదవిని సైతం వదులుకుని.. రైతు ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతుంటే.. వైకాపా, తెదేపాలు పోటీపడి మద్దతు ఇచ్చి రైతు ప్రయోజనాలను కాలరాశారని ఆరోపించారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తూ రైతులకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను వ్యతిరేకించకపోతే.. రైతుల ఆగ్రహానికి గురవుతారని... రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. రాజ్యసభలో అయినా బిల్లులను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. రైతు పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బిల్లులకు వ్యతిరేకంగా 25వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details