TSRTC BUSES: సంక్రాంతికి మూడు, నాలుగు రోజుల ముందు నుంచి కిటకిటలాడిన రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు... రెండ్రోజుల్లో మళ్లీ సందడిగా మారనున్నాయి. పండగకు ఇంటికి వెళ్లి.. తిరిగి వచ్చే వాళ్ల కోసం 110రైళ్లు... 225ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైతే మరిన్ని రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
అంతే సంఖ్యలో...
శబరిమలై నుంచి వచ్చే భక్తులకూ రైళ్లు కేటాయించినట్లు అధికారులు వివరించారు. సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ 3వేల 398 బస్సులు నడిపించింది. ఆంధ్రప్రదేశ్‌కి 1,000 బస్సులు, మిగిలిన బస్సులను... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తిప్పింది. స్వస్థలాల నుంచి తిరిగి వచ్చే వారి కోసం ఆయా జిల్లాల నుంచి అంతే సంఖ్యలో బస్సులను నడుపుతామని అధికారులు వెల్లడించారు.