ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TSRTC: టీఎస్‌ఆర్టీసీకి పెట్రోల్​ ధరల సెగ... బయటపడేందుకు ప్రణాళికలు - TSRTC suffers losses

TSRTC Losses : కరోనా కష్టాలు కలిగించిన నష్టాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న టీఎస్‌ఆర్టీసీని పెట్రో ధరలు మరోసారి పెరుగుతాయన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ సజ్జనార్ కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీలో ఏ విధంగా నష్టాలు వస్తున్నాయో అధికారులతో చర్చించి.. వాటిని లాభాలుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

TSRTC Losses
టీఎస్‌ఆర్టీసీకి పెట్రోల్

By

Published : Mar 7, 2022, 10:13 AM IST

TSRTC Losses : అంతర్జాతీయ మార్కెట్‌లో భగ్గుమంటున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు.. రేపోమాపో దేశంలోనూ పెట్రో ధరలు పెరుగుతాయన్న అంచనాలు టీఎస్‌ఆర్టీసీని కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఛార్జీల పెంపునకు ప్రభుత్వ అనుమతి కోరడంతో పాటు.. ఇతర అంశాలపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ కసరత్తు ప్రారంభించారు. భారీగా నష్టాలు వస్తున్న మార్గాలు? ఆయా రూట్లలో సర్వీసుల హేతుబద్ధీకరణకు ఉన్న అవకాశాలపై రీజియన్లవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏడు రీజియన్లుగా ఆర్టీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం రీజియన్ల అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.

నిర్ధారిత కిలోమీటర్లు తిరిగాక..

TSRTC suffers loss : ఆయా బస్సులను తుక్కుగా మార్చాలన్న విధానం ఆర్టీసీలో ఉంది. ఇకపై నిర్ధారిత కిలోమీటర్లు తిరిగినా.. చూడటానికి బాగుండి, కండిషన్‌లో ఉన్న బస్సులను యథావిధిగా నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. తక్కువ కిలోమీటర్లే తిరిగినా.. కండిషన్‌ సరిగాలేని బస్సులను తొలగించాలని నిర్ణయించారు. ప్రతి రీజియన్‌ పరిధిలో తొలగించాల్సిన బస్సులను గుర్తించి, వాటి స్థితిగతులపై నివేదికలు పంపాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు.

  • పెట్రో ధరల పెంపు సంకేతాల నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం అనుమతి కోరేందుకు అధికారులు యోచిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే సీఎంను కలిసి సంస్థ పరిస్థితిని నివేదించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఛార్జీల పెంపుదలపై గతంలో పంపిన దస్త్రానికి కదలిక వస్తుందని అంచనా వేస్తున్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని పది నెలల్లో టీఎస్‌ఆర్టీసీకి రూ.1995.58 కోట్ల నష్టం వాటిల్లింది. జనవరిలో రూ.208.56 కోట్ల నష్టం నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details