TSRTC News: నష్టాల నుంచి తెరకక్కడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న టీఎస్‌ఆర్టీసీ.. ఓవైపు లాభాల బాట పట్టేందుకు కృషి చేస్తూనే.. మరోవైపు వినూత్న ఆఫర్‌లు ప్రకటిస్తోంది. అదిలా ఉంటే ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) సేవలను అందిస్తోంది. ఇపుడు మరింత ఆధునికంగా.. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్(ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్)లను అందుబాటులోకి తెచ్చింది.
ఇదీ ప్రయోజనం..ప్రయాణానికి 20 నిమిషాల ముందు సీట్ల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోచ్చు. బస్సు ఎక్కడ ఉంది, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మన స్టేజీకి రావడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి వివరాలన్నీ ఐ-టిమ్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా కూడా టికెట్ ఛార్జీలు చెల్లించడానికి వెసులుబాటు లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే 928 ఐ-టిమ్‌లు కొన్నట్లు సమాచారం.