ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో 17 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు - విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు

విజయవాడలో ఈనెల 17 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు... నగర సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

Traffic restrictions in Vijayawada from 17 to 25 this month due to dasara celebrations
విజయవాడలో ఈనెల 17 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

By

Published : Oct 14, 2020, 7:38 PM IST

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఈనెల 17 నుంచి 25 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. నగర ప్రజలు, భక్తులకు అసౌకర్యం కలగకుండా... ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 20న ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు.

వివిధ చోట్ల పార్కింగ్ కు ఏర్పాట్లు

పద్మావతి ఘాట్, ఇరిగేషన్ పార్కింగ్‌, గద్ద బొమ్మ, లోటస్ అపార్ట్‌మెంట్‌, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్‌లో ద్విచక్రవాహనాల పార్కింగ్ కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీతమ్మవారి పాటలు, గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో కార్ల పార్కింగ్, పున్నమి ఘాట్ వద్ద బస్సుల పార్కింగ్‌కు అవకాశం కల్పించినట్లు సీపీ వివరించారు.

ఇదీ చదవండి:

ఆరోపణల్లో నిజం లేదని వివరించేందుకే ఆ లేఖ రాశా: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details