- కిడ్నాప్ కేసు : భూమి ధర పెరిగింది.. గుడ్‌విల్ కోసమే బెదిరింపులు!
సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిల ప్రియను ఏ-1గా.., ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డిని.., ఏ-3గా భార్గవ్‌రామ్‌ను తేల్చారు బోయిన్‌పల్లి పోలీసులు. భూమా అఖిల ప్రియ రిమాండ్ నివేదికలో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 108 టీఎంసీలు నీరు కేటాయించాలని కృష్ణా బోర్డుకు లేఖ
తాగు, సాగు నీటి అవసరాల మేరకు 108 టీఎంసీల నీటిని రాష్ట్రానికి కేటాయించాలని కోరుతూ... కృష్ణా యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ బోర్డుకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆలయాలపై ఘటనలకు బాధ్యత ప్రభుత్వానిదే: తెదేపా నేతలు
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. 144 ఘటనలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిందూపురంలో రెండో రోజు బాలయ్య పర్యటన
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన రెండోరోజు హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పర్యటిస్తున్న బాలకృష్ణను చూసేందుకు.. అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్ భేటీ
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ నెల 8న దేశవ్యాప్తంగా మరోసారి డ్రైరన్ నిర్వహించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రేపటి డ్రై రన్, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, ముందస్తు జాగ్రత్తలు, ఇతర విషయాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మోదీ అజేయుడు.. మన్మోహన్ విధేయుడు'