ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm

...

top news @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Jun 9, 2020, 3:00 PM IST

Updated : Jun 9, 2020, 3:10 PM IST

  • స్పందన లేదు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రాజకీయ, రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో 175వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని నక్కా ఆనంద బాబు కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విచారణ వాయిదా

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కేసు విచారణను హైకోర్టు... ఈ నెల 16కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటరుకు సమాధానంగా పిటిషన్‌ వేసేందుకు తమకు గడువు ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం హైకోర్టును కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గోమాత రోదన

అటువైపు వెళ్తే గోమాత ఆశగా చూస్తోంది. వారి ఆకలి బాధ తీర్చడానికి ఏమైనా తెస్తారేమోనని... డొక్కలెండిపోతున్న కడుపు నింపుతారేమోనని... దీనమైన కళ్లతో ఎదురుచూస్తోంది. వాటికే గనక మాట్లాడే శక్తుంటే... ప్రపంచమంతా వినపడేలా చెప్పుకునేవేమో. సాటి మనిషి ఆకలి బాధ తీర్చడానికి మరో మనిషి ఉన్నాడు. కానీ మూగ జీవాల ఆకలి కేకలు తీర్చడానికి ఎవరున్నారు? వాటి కడుపు నింపడానికి మంచి మనసున్న దాత కోసం ఎదురుచూస్తోన్న మూగజీవాలపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భ్రష్టు పట్టించారు.

ఏడాదికాలంలో సాగునీటి రంగాన్ని సీఎం జగన్ భ్రష్టుపట్టించారని మాజీమంత్రి దేవినేని మండిపడ్డారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టు పనులను ఆపేశారని విమర్శించారు. ప్రాజెక్టు పనులు ఎందుకు ఆపేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొరవడిన ప్రజాస్వామ్యం

ప్రస్తుతం కాంగ్రెస్​లో పరిస్థితులు, సంక్షోభంపై పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్​ ఝా 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విద్యార్థులకు ప్రమోషన్​

10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి. 12వ తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసుపత్రిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

మధ్యప్రదేశ్​ భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియా దిల్లీలోని మ్యాక్స్​ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంగా ఉండటం వల్లే ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉపాధి కల్పనపై దృష్టి

లాక్​డౌన్​తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆన్​లాక్​ 1.0 ప్రారంభించింది కేంద్రం. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే సరైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్​​ ఎన్.ఆర్​.భానుమూర్తి 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గుడ్​బై చెప్పడానికి అదే కారణం

పాకిస్థాన్ పేసర్​ వాహబ్​ రియాజ్​ టెస్టులకు గుడ్​బై చెప్పడానికి గల కారణాలను తెలిపాడు. సెలెక్టర్లు తనపై నిర్లక్ష్యంగా వ్యవహించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'గుంజన్ సక్సేనా'

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ నటించిన 'గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్'​ సినిమా త్వరలో ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో నేరుగా విడుదల కానుంది. ఇందులో టైటిల్​ రోల్​ పోషించిందీ ముద్దుగుమ్మ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jun 9, 2020, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details