రాష్ట్రాన్ని వైకాపా నేతలు హత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో దేవుళ్లతో సహా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అనంతపురం పోలీసులకు షాక్ ఇచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య
అక్రమ కేసులపై పోరాటానికి సిద్ధమైన జేసీ సోదరుల దీక్షా ప్రయత్నాన్ని భగ్నం చేయాలన్న ఆలోచనతో పోలీసులు ఆ ఇద్దర్నీ గృహనిర్బంధం చేశారు. వాళ్లు బయటకు రాకుండా కట్టడి చేశారు. దీన్ని గమనించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య... పోలీసుల కన్నుగప్పి బయటకు వచ్చి షాకిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 6న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోంది: మోదీ
రెండు కరోనా టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అతిపెద్ద టీకా వ్యాక్సినేషన్ భారత్‌లో ప్రారంభం కానుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం- స్తంభించిన రాకపోకలు
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను మంచు కమ్మేసింది. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీకి గుండెపోటు'
రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీ గుండెపోటుకు గురయ్యారని సీపీఐ(ఎం) సీనియర్ నేత అశోక్ భట్టాచార్య పేర్కొన్నారు. సౌరవ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచవ్యాప్తంగా 8.5కోట్లు దాటిన కరోనా కేసులు
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఒక్కరోజే 5.1లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 8కోట్ల 55లక్షలకు పెరిగింది. కొత్తగా మరో 7,099 మంది మరణాలతో.. మృతుల సంఖ్య 1.08 కోట్లకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బార్సిలోనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ రికార్డు
బార్సిలోనా క్లబ్ తరఫున 500 మ్యాచ్‌లు ఆడిన ఘనత సాధించాడు స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ. గతేడాది అతడు ఈ క్లబ్ నుంచి వైదొలగాలనుకున్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సోనూసూద్ హీరోగా తొలి సినిమా ప్రకటన
సోనూసూద్ కథానాయకుడిగా తొలి చిత్రం ఖరారైంది. 'కిసాన్' పేరుతో ఈ సినిమా తీయనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.