- ఏలూరు: చిన్నారులనూ వదలని వింత వ్యాధి
అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య ఏలూరులో మరింతగా పెరుగుతోంది. నాలుగు రోజులుగా ఈ సమస్య ఏలూరు ప్రజలను వేధిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గుంటూరు జిల్లా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులపై స్పష్టత
గుంటూరులో ఉపాధ్యాయ బదిలీ ఖాళీలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. కొద్ది రోజుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం... తుది జాబితాను జిల్లా విద్యాశాఖ రూపొందించింది సోమవారం ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్యాంకులోని నగదు, ఆభరణాలతో అటెండర్ పరారీ..!
కెనరా బ్యాంకు శాఖలో అటెండర్ నగదు, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది. సిబ్బంది మధ్యాహ్న భోజనానికి వెళ్లిన సమయంలో అటెండర్ సురేష్ సీసీ టీవీలను ఆఫ్ చేసి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వృద్ధులకు రాయితీలిచ్చి గౌరవిస్తే సరిపోదు..: హైకోర్టు
వృద్ధులకు బస్సు, రైళ్లు, విమాన ప్రయాణాల్లో రాయితీలు, రైళ్లలో కింది బెర్త్‌లు, బస్సుల్లో సౌకర్యవంతమైన సీట్లు కేటాయింపుతో ఇచ్చే గౌరవం సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పాక్, చైనాలో ఆందోళనకరంగా మత స్వేచ్ఛ'
మత స్వేచ్ఛను హరిస్తున్నాయనే ఆరోపణలతో 8 దేశాలను ఓ జాబితాలో చేర్చింది అమెరికా. ఇందులో పాకిస్థాన్, చైనా ఉన్నాయి. ఈ దేశాల్లో మత స్వేచ్ఛ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అగ్రరాజ్యం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే కనిపిస్తోంది. కొత్తగా 26,567 కేసులు నమోదు కాగా.. 39,045 మంది డిశ్చార్జ్ అయ్యారు. 385 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రామాలయ నిర్మాణ ప్రణాళిక త్వరలోనే ఖరారు
అయోధ్యలో రామాలయ పునాదులు వెయ్యేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండేలా దృఢంగా నిర్మించనున్నట్లు తెలిపారు ఆలయ నిర్మాణ కమిటీలోని కీలక సభ్యులు అనిల్ మిశ్రా. గుడి నిర్మించే భూభాగం అడుగులో ఇసుక ఉండటంపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. ఆలయ నిర్మాణ ప్రణాళికపై చర్చించేందుకు నిపుణులతో రెండు రోజుల సమావేశం నిర్వహిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ట్రంప్ టిక్‌టాక్ బ్యాన్ యత్నాలకు బ్రేక్!
పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతా కారణాలతో టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అమెరికా ఫెడరల్ జడ్జ్ స్టే విధించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్సింగ్కు చోటు
బ్రేక్ డ్యాన్సింగ్కు ఒలింపిక్ హోదా లభించింది. పారిస్ వేదికగా 2024లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఈ పోటీలను అధికారికంగా నిర్వహించనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అందుకే చిరు 'సైరా'తో రీఎంట్రీ ఇవ్వలేదు!
'ఖైదీ నంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి . అదే 'సైరా నరసింహారెడ్డి' చిత్రంతో ఇచ్చి ఉంటే ఎలా ఉండేది? అదే అనుమానం చిరుకి కూడా కలిగింది. కానీ ఆయన 'ఖైదీ 150' తోనే మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నారు. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.