ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు..! - JAIPALREDDY

జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. నెక్లెస్​ రోడ్​లోని పీవీ ఘాట్ పక్కనే నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

tomarrow-jaipal-crimetion-at-side-of-the-pv-ghat

By

Published : Jul 28, 2019, 10:14 AM IST

కాంగ్రెస్ దివంగత నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. 9 గంటలకు గాంధీభవన్‌కు పార్థివదేహం తీసుకొస్తారు. 11 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్యుల సందర్శనార్థం ఉంచుతారు. తరువాత నెక్లెస్ రోడ్డుకు అంతియయాత్ర సాగుతుంది. అక్కడ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్ పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు. పీవీ ఘాట్ పక్కన ఉన్న స్థలానికి ప్రభుత్వ అనుమతి ఇచ్చిన వెంటనే అక్కడ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

రేపు పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు..!

ABOUT THE AUTHOR

...view details