Jawad Cyclone Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జవాద్ తుపాను కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశమార్చుకున్న తుపాను.. ప్రస్తుతం మందగమనంతో ఒడిశా తీరంవైపు సాగుతోంది. గడచిన 6 గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను.. విశాఖకు ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది.
Jawad Cyclone Moving towards puri coast in odisha: విశాఖకు ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం.. రేపు ఉదయం ఒడిశా తీరానికి దగ్గరగా చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత మరింతగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపుగా కదిలే సూచనలు ఉన్నట్టు అంచనా వేసింది.