ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 26, 2020, 12:27 AM IST

ETV Bharat / city

'ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదు'

కరోనా విజృంభిస్తున్న సమయంలో సెప్టెంబర్ ఐదు నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

tnsf venugopal on schools open
tnsf venugopal on schools open

విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్.. ముఖ్యమంత్రికి జగన్​ను లేఖ రాశారు. రాష్ట్రంలో 24 గంటల్లో 9 నుంచి 10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఇంటర్నెట్​ సదుపాయాలు లేక వెనకబడే అవకాశముందని చెప్పారు. విద్యా సంవత్సరాన్ని వాయిదా వేస్తే అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు. సీఎం జగన్​.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details