కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రివర్గంలోచోటు లభించింది. తొలినుంచీ తనకు అండగా ఉంటూ... పార్టీకి అందించిన సేవలను గుర్తించిన జగన్... నానికి మంత్రి పదవిని కట్టబెట్టారు. 2012లో వైకాపాలో చేరిన నాని... అప్పటి నుంచీ జగన్తో నడిచారు. 2004లో తొలిసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లోనూ విజయం సాధించారు. మొత్తం నాలుగుసార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ గెలుపొందిన కొడాలి నాని... మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
కొడాలి నాని
నియోజకవర్గం:గుడివాడ
వయస్సు:47
విద్యార్హత:పదో తరగతి
రాజకీయ అనుభవం:నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
జిల్లా కేంద్రం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందిన పేర్ని నానికి జగన్ సైన్యంలో చోటు దక్కింది. అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు సంపాదించుకున్న పేర్ని నాని... 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2019లోనూ విజయం సాధించారు. తొలి నుంచీ తన కుటుంబానికి అండగా ఉన్న... పేర్నినానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.