సర్కారు మద్యం దుకాణాల్లో నిబంధనలకు పాతర - ఏపీలో మద్యం విక్రయాలు
రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని చోట్ల నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆదేశాలను గాలికొదిలేసి విక్రయాలు జరుపుతున్నారు నిర్వాహకులు.
విజయవాడ నగర శివారు ప్రాంతాలైన నున్న, కండ్రిక ప్రాంతాల్లో మద్యం దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకే మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పదిగంటల వరకు విక్రయాలు జరుపుతున్నారు. అంతేగాక షాపు దగ్గర మద్యం సేవించటానికి అనుమతి లేనప్పటికీ మందుబాబులు అక్కడే తాగుతున్నారు. దీనిపై స్పందించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి కొత్త మద్యం నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.