50 వేల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
నవరత్నాల్లోని పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను 50 వేల ఇళ్ల నిర్మాణాల నిధుల విషయంలో స్పష్టతనిచ్చింది.
ప్రధాన మంత్రి అవాస్ యోజన.. వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 50 వేల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థలు - అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోకి రాని ప్రాంతాల్లో పీఎంఏవై - వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇళ్ల నిర్మాణాల నిధుల విషయంలో స్పష్టతనిచ్చింది. ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ. లక్షా 80 వేల వ్యయం అవుతుందని తెలిపింది. ఇందులో రూ. 78 వేలు కేంద్ర ప్రభుత్వం.. రూ. 72 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని, మరో 30 వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొందవచ్చని వెల్లడించింది.