విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. కొవిడ్ ఆస్పత్రిలోనే వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. గతనెల 24న కొవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడు ఆదృశ్యమయ్యాడు. అదేరోజు వృద్ధుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది మార్చురీకి తరలించారు.
అసలు ఏం జరిగింది...
విజయవాడ వన్ టౌన్లో నివసించే ఓ వృద్ధునికి ఆరోగ్యం సరిలేకపోవటంతో..గత నెల24న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అతని భార్య. అయితే అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో...ఆ ఆస్పత్రి సిబ్బంది వృద్ధుడిని కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దాంతో ఆమె కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ అతను ఆదృశ్యమయ్యాడు. దీనిపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి:విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు అదృశ్యం