ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య పెట్టుబడులు, పరస్పర వాణిజ్య భాగస్వామ్యానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఓ ఫారెల్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి.. ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ అయ్యారు. ఏపీలో లిథియం బ్యాటరీల ఉత్పత్తికి తమ దేశానికి చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఫారెల్ అన్నారు.
'పరస్పర వాణిజ్య భాగస్వామ్యానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' - ఏపీ పరిశ్రమల శాఖ మంత్రితో భేటీ అయిన ఆస్ట్రేలియా హైకమిషనర్
విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఓఫారెల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని ఫారెల్ పేర్కొన్నారు.
'పరస్పర వాణిజ్య భాగస్వామ్యానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం'
విశాఖలోని మెడ్‌టెక్ జోన్లో అంతర్జాతీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా పరిశ్రమలు ఏర్పాటు కావటం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు, బ్యాటరీ తయారీ రంగాల్లో ఏపీతో భాగస్వామ్యానికి సుముఖంగా ఉన్నామని ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సారా వెల్లడించారు. అంతకుముందు ఆస్ట్రేలియన్ ప్రతినిధుల బృందానికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు.