chalo Vijayawada : విజయవాడ లెనిన్ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కార్మికులను అడ్డుకున్నారు. సమస్యల కోసం పోరాడుతుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులతో మున్సిపల్ కార్మికులు వాగ్వాదానికి దిగారు. అక్రమ అరెస్ట్‌లతో పోరాటం ఆపలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడికక్కడే అరెస్టులు..
విజయవాడ ధర్నాచౌక్‌కు వస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి ఆటో, కాలినడకన ధర్నాచౌక్ కు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో వారిని నున్న, భవానీపురం, వన్ టౌన్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం పీఆర్సీని తమకు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలను నెరవేర్చకపోతే నిరహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.