రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నెలలపాటు వెనక్కి వెళ్లిపోతోంది. కరోనా ప్రభావం...లాక్‌డౌన్ అమలు ఫలితంగా ఇప్పటికీ గత విద్యా సంవత్సరం చివర్లో జరగాల్సిన పరీక్షలు ఇంకా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అన్నింటా ఇదే ధోరణి. పదో తరగతి మినహా ఇతర పాఠశాల చదువుల్లో విద్యార్ధులకు పరీక్షల బెడద లేకుండానే పై తరగతికి ఉన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వం, ప్రయివేటు పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేయడంతో.. పదో తరగతి తప్ప ఇతర తరగతుల విద్యార్ధులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండానే...విద్యా సంవత్సరాన్ని ముగించేశారు.
ఆగస్టు 3 నుంచే పాఠశాలలు...!
ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా పరీక్షల నిర్వహణ, ఫలితాలు పూర్తవుతాయని అంచనా వేసింది. అప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. తరగతుల నిర్వహణ సమయంలో.. ఉదయం నిర్వహించే ప్రార్థన రద్దు చేసి.. తరగతి గదిలో మైకుల ద్వారా చేయించుకోవచ్చుని పేర్కొంది. 30మంది విద్యార్థులు మించి ఉంటే ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహించాలని సూచించింది.
నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించాలి...