ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cricketer Geethika Kodali: తెలుగు యువ కెరటం గీతిక కొడాలి.. 14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్‌ జట్టులోకి..! - Cricketer Geethika Kodali

Cricketer Geethika Kodali: ఆశయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని ఓ తెలుగు యువ కెరటం నిరూపించింది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్‌ చేతపట్టి.. 14 ఏళ్లకే యూఎస్‌ మహిళా క్రికెట్‌ జట్టులో ఆడే అవకాశం దక్కించుకుంది. 17 ఏళ్లకు అండర్‌-19 జట్టుకు సారథ్యం వహిస్తోంది గీతిక కొడాలి. యూఎస్‌ ఉమెన్స్‌ జట్టు కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌లో ఆడటమే  లక్ష్యం అంటున్న గీతిక ‘ఈనాడు-ఈటీవీ-భారత్​’కి చెప్పిన ముచ్చట్లు..

Cricketer Geethika Kodali
తెలుగు యువ కెరటం గీతిక కొడాలి

By

Published : Mar 7, 2022, 7:06 AM IST

Cricketer Geethika Kodali: కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్‌, మాధవిల కుమార్తె గీతిక.. అమెరికాలోని నార్త్‌కరోలినాలో 12వ తరగతి చదువుతూనే క్రికెట్‌లో సత్తా చాటుతోంది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్‌ చేతపట్టి.. 14 ఏళ్లకే యూఎస్‌ మహిళా క్రికెట్‌ జట్టులో ఆడే అవకాశం దక్కించుకుంది. 17 ఏళ్లకు అండర్‌-19 జట్టుకు సారథ్యం వహిస్తోంది గీతిక కొడాలి. కెప్టెన్‌గా తమ బృందాన్ని విజయపథంలో నడిపిస్తూ తొలి సిరీస్‌లోనే విజయాన్ని అందుకుంది. యూఎస్‌ ఉమెన్స్‌ జట్టు కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌లో ఆడటమే లక్ష్యం అంటున్న గీతిక ‘ఈనాడు-ఈటీవీ-భారత్​’తో పలు విషయాలను పంచుకుంది.

తెలుగు యువ కెరటం గీతిక కొడాలి

యూఎస్‌ మహిళా జట్టుకు ఎంపికై

చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. కానీ క్రికెటే నా లోకం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల సూచనతో కోచ్‌ రఘును కలిశాం. శిక్షణ తీసుకుంటే క్రికెట్‌లో బాగా రాణిస్తావని ఆయన చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత 14వ ఏట అమెరికన్‌ మహిళా జట్టులోకి వెళ్లే అవకాశం లభించింది. జట్టు ఎంపిక కోసం మూడు క్యాంప్‌లు జరిగాయి. 32 మంది హాజరయ్యారు. 14 ఏళ్ల విభాగంలో ఎంపికయ్యా. జట్టులో నేనే చిన్నదాన్ని. నేషనల్‌ ఉమెన్‌ క్రికెట్‌ లీగ్‌కు ఆడాను. సీనియర్ల నుంచి మెలకువలు నేర్చుకోవడంతోపాటు.. ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాను. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్‌లు ఆడాను.

అమ్మానాన్న సహకారంతోనే

తల్లిదండ్రులు కొడాలి ప్రశాంత్‌, మాధవి తో గీతిక

మ్మ మాధవి, నాన్న ప్రశాంత్‌ సహకారంతోనే క్రికెట్‌లో రాణిస్తున్నా. చిన్ననాటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నార్త్‌కరోలినా అయితే క్రికెట్‌కు మంచి సౌకర్యాలు ఉంటాయని.. నా కోసమే కాలిఫోర్నియా నుంచి నివాసం మార్చారు. ఇది నా చదువుకు కూడా దోహదపడింది. నా చిన్నతనంలో ఏటా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాళ్లం. హైస్కూల్‌కు వచ్చాక సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌తో అవకాశం కుదరలేదు. ఈ లోగా కొవిడ్‌ రావడమూ కారణమైంది. త్వరలో ఇండియాకు వస్తాను. మన గడ్డపై కూడా క్రికెట్‌ ఆడతాను.

అండర్‌-19 జట్టు సారథిగా

మెరికాలో తొలిసారిగా గతేడాది అండర్‌-19 జట్టును ఏర్పాటు చేశారు. జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించే అవకాశం మొదటగా నాకే లభించింది. మొత్తం 15 మందితో కూడిన మా జట్టు తొలి పర్యటనలో భాగంగా కరేబియన్‌ ఐలాండ్స్‌లో సెయింట్‌ విన్సెంట్‌లో ఆడాం. ఈ జట్టులో అత్యధికులు భారతీయ సంతతి వారే. సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి.. మూడు గెలిచాం. బృంద సభ్యుల్లో విశ్వాసం నింపుతూ.. విజయం దిశగా అడుగేశాం. మే నెలలో దుబాయ్‌లో జరిగే ఫెయిర్‌బ్రేక్‌ టోర్నమెంట్‌కు మా బృందం సిద్ధమవుతోంది. మహిళా క్రికెట్‌ను యూఎస్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు ఐసీసీ ఛార్టర్‌ ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. శాటిలైట్‌ కోచ్‌ సెషన్స్‌ ఏర్పాటు చేసి.. స్థానికంగా శిక్షణ ఇచ్చేవారు. అక్కడ సిద్ధమయ్యాక.. టీమ్‌ ప్రాక్టీసెస్‌, మ్యాచ్‌కు వారంముందు బృందం సభ్యులంతా కలిసి మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో రీజినల్స్‌, నేషనల్‌ ఆడాం. క్రికెట్‌ నాకు సమయపాలన నేర్పింది. చదువు, ఆటను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. తొమ్మిది, పదో గ్రేడ్‌ల వరకు స్కూల్‌లో రాణిస్తూనే క్రికెట్‌ ఆడేదాన్ని. 11, 12 గ్రేడ్లలో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సహకారం అందించారు. క్రికెట్‌తో నాలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ పెరిగాయి.

ఇండియా ఉమెన్స్‌ ఐపీఎల్‌లో పాల్గొనాలి

జట్టు సభ్యులతో గీతిక

గీతిక చిన్నప్పటి నుంచి క్రికెట్‌ ఆడేది. కోచ్‌ రఘును కలవగా క్రికెట్‌లో బాగా రాణిస్తుందని చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత యూఎస్‌ ట్రైఔట్స్‌కు వెళ్లి.. విజయవంతంగా ఎంపికైంది. ఇప్పుడు ఆల్‌రౌండర్‌గా అడుగేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సిరీస్‌లో తొలి విజయం నమోదు చేయడం సంతోషించదగ్గ విషయం. ఇండియా ఉమెన్స్‌ ఐపీఎల్‌లో ఆమె పాల్గొనాలని కోరుకుంటున్నాం. -తల్లిదండ్రులు కొడాలి ప్రశాంత్‌, మాధవి

ఇదీ చదవండి:

మెుక్కలతో మమేకం.. అదే ఆమె వ్యాపకం !

ABOUT THE AUTHOR

...view details