ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలు మాఫీ అంటూ సీఎం జగన్ రెడ్డి టోకరా వేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. రుణాలిచ్చింది ఎవరు.. దాని ప్రకారం ఎవరు ఎక్కువ సాయం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆసరా పథకంలో వంచనే తప్ప న్యాయం లేదని మండిపడ్డారు.
ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు సీఎం టోకరా: తెదేపా - tdp leaders fire on cm jagan latest news
ఆసరా పేరుతో పాత పథకానికి పేరు మార్చి జగన్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలు మాఫీ అంటూ జగన్ రెడ్డి టోకరా వేస్తున్నారని ఆరోపించారు.
tdp
ఆసరా పేరుతో పాత పథకానికి పేరుమార్చి జగన్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జగన్ రెడ్డి క్విడ్ ప్రోకో, క్రిమినల్ మైండ్ సెట్‌తో మహిళా సంఘాలను వంచిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా రాజకీయ రాక్షసత్వాన్ని ఎదురిస్తామని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి :'వైఎస్ఆర్ ఆసరా'కు సీఎం జగన్ శ్రీకారం
TAGGED:
tdp leaders fire on cm jagan