ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

teachers union on prc : పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు

teachers union on prc : పీఆర్సీ సాధన సమితి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నామని ఉపాధాయ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కానీ అది నేరవేరలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించి.. సమ్మె విరమిస్తున్నట్లు పీఆర్సీ నేతలు ప్రకటించారు. స్టీరింగ్‌ కమిటీ నిర్ణయాన్ని ఎస్‌టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ వ్యతిరేకించాయన్నారు. అందుకే స్టీరింగ్‌ కమిటీకి తాము రాజీనామా చేస్తున్నామన్నారు.

teachers union
teachers union

By

Published : Feb 8, 2022, 12:31 PM IST

teachers union on prc : పీఆర్సీ సాధన సమితి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నామని ఉపాధాయ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అశోతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక ఇస్తామనడంతో చర్చలకు వెళ్లామన్నారు. హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబుల ప్రకారం ఇవ్వాలని.. ప్రధాన డిమాండ్‌ ఫిట్‌మెంట్‌ విషయాన్ని తేల్చాలని కోరామన్నారు. అలాగే అదనపు క్వాంటం పింఛన్‌ తగ్గించవద్దని విజ్ఞప్తి చేశామన్నారు. అదనపు క్వాంటం పింఛన్‌ విషయంలో ప్రభుత్వం తమతో బేరాలు ఆడి 7, 12 శాతంగా తేల్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేదని ప్రభుత్వం తమతో తెలిపిందన్నారు.

ఉద్యోగుల గ్రాట్యూటీ విషయంలోనూ తమకు అన్యాయం జరిగిందని నేతలు ఆరోపించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రెండేళ్ల తర్వాత గ్రాట్యూటీ వస్తుందన్న నేతలు.. కనీసం ఐఆర్‌ 27 శాతమైనా ఇవ్వాలని కోరామన్నారు. దానిపై స్పందించిన ప్రభుత్వం..ఐఆర్‌ ముగిసిన అంశం మళ్లీ ప్రస్తావించవద్దని చెప్పారన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను స్టీరింగ్‌ కమిటీ భేటీలో ఎస్‌టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ వ్యతిరేకించాయన్నారు. స్టీరింగ్‌ కమిటీలో మెజార్టీ నిర్ణయం ప్రకారం సమ్మె విరమిస్తున్నట్లు పీఆర్సీ నేతలు ప్రకటించారు. స్టీరింగ్‌ కమిటీ తమ మాటలు వినకుండా ఏకపక్షంగా వెళ్లిందన్నారు. అందుకే స్టీరింగ్‌ కమిటీకి తాము రాజీనామా చేస్తున్నమన్నారు.

స్టీరింగ్‌ కమిటీకి ఉపాధ్యాయ సంఘాల నేతలం రాజీనామా చేస్తున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనలకు 3 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ చర్చల్లో స్టీరింగ్‌ కమిటీ ఏకపక్షంగా వెళ్లింది. రాష్ట్రంలోని జేఏసీ ఛైర్మన్లకు రాజీనామాలు పంపుతున్నాం. పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు చేపడతాం. రౌండ్‌ టేబుల్‌ భేటీలో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమిస్తాం.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఉద్యమిస్తాం.సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం.- ఉపాధ్యాయ సంఘాలు

teachers protest రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు రానున్నట్లు టీచర్లు తెలిపారు. ఫ్యాప్టో ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. దశలవారీ పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యంగా పిలుపునిచ్చారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలోని 12 సంఘాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఫిట్‌మెంట్‌ 27 శాతం ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి

Teachers Protest: రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల ఆందోళనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details