రఘురామకృష్ణరాజు ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని విజయసాయి వ్యాఖ్యనించంటం వ్యక్తిగత రాజకీయమేనని తెదేపా నేత సయ్యద్ రఫీ అన్నారు. అలా కాకుండా..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా పార్లమెంట్‌ను స్తంభింపజేస్తే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాల్లో స్టీలు ప్లాంటు అంశం పక్కదారి పట్టించేందుకే రఘురామ వ్యవహారాన్ని విజయసాయి లేవనెత్తారని విమర్శించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల్ని దుర్వినియోగం చేస్తున్న అంశాలపై పార్లమెంటును స్తంభింపజేయాలని ఆయన సూచించారు. వైకాపాలో చేరిన తెదేపా ఎమ్మెల్యేల సభ్యత్వాలు ముందుగా సభాపతితో రద్దు చేయించి అప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడాలని దుయ్యబట్టారు.