TDP PARLIAMENTARY PARTY MEETING TODAY: నేడు.. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం పార్టీ ఎంపీలో భేటీలో(tdp chief chandrababu meet to Party MPs) నిర్వహించున్నారు. ఈ నెల 29నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, విభజన హామీలు సాధించటంలో వైకాపా విఫలం, వరద ముంపు బాధితుల్ని ఆదుకోవటంలో నిర్లక్ష్యం, తాజా రాజకీయ పరిణామాలతోపాటు రాష్ట్రంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ, తదితర అంశాలపై ఎంపీలు ఉభయసభల వేదికగా పోరాడాలని దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.