TDP MLC MANTHENA FIRES ON VALLABHANENI: ఎన్టీఆర్ కుటుంబం పేరెత్తే అర్హత వల్లభనేని వంశీకి లేదని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు వెల్లడించారు. తెదేపాకు వెన్నుపోటు పొడిచి.. నీతి సూక్తులు మాట్లాడడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గాల్లో దీపంలా మారాడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్పై అభిమానం ఉంటే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. పరిటాల రవి పంచన బతికి.. ఆ కుటుంబాన్ని విమర్శించే వంశీని వెన్నుపోటుదారుడు కంటే మరేదైనా పెద్ద పదంతో పిలవాలన్నారు. అమరావతి పాదయాత్రలో పెట్టుబడిదారులున్నారని వంశీ అనటం సిగ్గుచేటని మండిపడ్డారు. విశాఖ గర్జన సభలో ఉన్నది స్వాతంత్య్ర ఉద్యమకారులా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర దోపిడీదారులంతా పెయిడ్ గర్జన పేరుతో నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ కుటుంబం పేరు ఎత్తే అర్హత వల్లభనేనికి లేదు: ఎమ్మెల్సీ మంతెన - తెదేపా ఎమ్మెల్సీ
TDP MLC MANTHENA ON MLA VALLABHANENI : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై వల్లభనేని వంశీకి ఆ కుటుంబం పేరు ఎత్తే అర్హత లేదని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. తెదేపాకు వెన్నుపోటు పొడిచి.. నీతి సూక్తులు మాట్లాడడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.
TDP MLC MANTHENA ON MLA VALLABHANENI
ఇవీ చదవండి:
- ఐసీసీ ఛైర్మన్ రేసులో ఎవరు?.. గంగూలీకి కష్టమేనా?
- హిమ సీమలో ఎన్నికల వేడి.. కమలం నిలుస్తుందా?.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా!
- భార్యపై అనుమానం.. కత్తితో 15సార్లు పొడిచి హత్య.. 12ఏళ్ల బాలుడి తల నరికి..
- 'నా చాక్లెట్లు కొట్టేస్తోంది.. మా అమ్మను జైల్లో పెట్టండి'.. బుడ్డోడి ఫన్నీ ఫిర్యాదు
- పాస్వర్డ్ లేకుండానే ఆన్లైన్ ఖాతా లాగిన్.. గూగుల్ నయా ఫీచర్
Last Updated : Oct 18, 2022, 3:55 PM IST