రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం గడువు కోరటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. సిబ్బంది కొరత అని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని దుయ్యబట్టారు. హైకోర్టుతో చివాట్లు తినటం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. పది నెలల పాలనలో కోర్టులో 52 సార్లు మొట్టికాయలు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు రాజ్యాంగమంటే గౌరవం లేదని మండిపడ్డారు. వైకాపా అరాచకాలకు ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కేసులను తక్కువ చేసి చూపటం దారుణమని వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
'హైకోర్టుతో చివాట్లు తినటం జగన్ ప్రభుత్వానికి అలవాటైంది'
హైకోర్టుతో చివాట్లు తినటం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం గడువు కోరటం సిగ్గు చేటన్నారు.
తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు