సంక్రాంతిలోపు తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తెదేపా నేత, మాజీ మంత్రి బొండా ఉమా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పండుగ రోజున సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. నిరనస తెలుపుతున్న మహిళలతో చంద్రబాబు దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడారు. తెదేపా... మహిళా సాధికారతకు ఎంతో కృషి చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సంక్రాంతిలోపు పేదలకు ఇళ్లు అప్పగించాలి: బొండా ఉమా - ఏపీలో పేద ప్రజలకు ఇళ్లు
తెదేపా హయంలో నిర్మించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ...విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా...సంక్రాంతిలోపు పేదలకు ఇళ్లు అప్పగించకపోతే దగ్గరుండి సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు.
సంక్రాంతిలోపు పేదలకు ఇళ్లు అప్పగించాలి