రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెదేపా నేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 5న విజయవాడలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహణ ఏర్పాట్లను ఆ పార్టీ ముఖ్యనేతలు విజయవాడ కేశినేని భవన్లో భేటీ అయ్యి చర్చించారు. వైకాపా మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను సమావేశానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
'రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా ఒత్తిడి తెస్తాం' - TDP leaders LATEST MEETING IN VIJAYAWADA
ఈ నెల 5న జరిగే చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంపై తెదేపా నేతలు చర్చించారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, నిపుణులను పిలవాలని నిర్ణయించారు.
చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంపై చర్చించిన నేతలు