TDP leaders fires on CM Jagan: ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో.. జగన్ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారని మండిపడ్డారు. ప్రచారంలో చిటికెలేసి మరీ.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదని.. అచ్చెన్న అన్నారు.
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ..సీఎం జగన్ బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై రుద్దేందుకు యత్నిస్తున్నారని.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ ఇచ్చిన హామీని.. ఉపాధ్యాయులు నెరవేర్చాలంటున్నారే తప్ప.. లోటస్ పాండ్లో వాటా అడగటం లేదు కదా అని నిలదీశారు. ఏపీలో జగన్ పాలనలో ఉన్న ఆంక్షలు.. కశ్మీర్ సరిహద్దుల్లోనూ లేవని విమర్శించారు.