TDP leaders fires on CM Jagan: భీమ్లానాయక్ సినిమా విషయంలో.. సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జగన్ తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబు
భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని వ్యవస్థలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ..భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు: లోకేశ్
భీమ్లా నాయక్ సినిమా అన్ని కుట్రలు అధిగమించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆకాక్షించారు. జగన్.. రాష్ట్రంలోని పరిశ్రమలను నాశనం చేస్తున్నారని.. దీనికి సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదన్నారు. సినిమాకు అద్భుత స్పందన వస్తోందని, తానూ చూడాలని ఆతృతగా ఉన్నానని.. లోకేశ్ ట్వీట్ చేశారు. అన్ని కుట్రలను అధిగమించి.. సినిమా మంచి విజయం సాధించాలని లోకేశ్ ఆకాంక్షించారు.
రెవెన్యూ సిబ్బందిని గేటుమెన్లుగా చేశారు: అయ్యన్నపాత్రుడు
అక్షరాలు నేర్పే ఉపాధ్యాయులను మద్యం షాపులకు కాపలా పెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు మండల పాలన చూసే రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్లకి గేటుమేన్లను చేశారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం ఇవ్వడంవల్లే ఈ ఖర్మ పట్టిందని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: