అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతివ్వడమా.. లేక రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడమో సీఎం జగన్ తేల్చుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు జీవీ.ఆంజనేయులు సవాల్ విసిరారు. రైతుల మహా పాదయాత్రకు మంచి స్పందన వస్తుండటంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 700 రోజులు సాగిన అమరావతి ఉద్యమం కంటే ఏడు రోజుల పాదయాత్ర భారీ విజయవంతం అయిందన్నారు. ఫలితంగా అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్యం ప్రయత్నిస్తోందని జీవీ.ఆంజనేయులు ఆరోపించారు.
TDP LEADERS : 'మహాపాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం'
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం తీవ్రతరం అవుతున్నందున...ఆందోళనలను ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కోర్టు నిబంధనల ప్రకారమే అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టారని స్పష్టం చేశారు.
తెదేపా నేతలు
అమరావతి రైతుల మహాపాదయాత్రను ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లుఅన్నారు. పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. న్యాయస్థానం నిబంధనల ప్రకారమే రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు.
అనుబంధ కథనాలు...