ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డప్పులు, చప్పట్లు కొట్టే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు' - జవహర్ తాజా వార్తలు

అధికారం ఉన్నంత కాలం చంద్రబాబు చుట్టూ తిరిగిన జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్యవరప్రసాద్​లు ఇప్పుడు కులాన్ని అడ్డుపెట్టుకొని ఎదగాలని చూస్తున్నారని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. చర్మకారులు, చెప్పులు కుట్టుకునేవారు, డప్పు కొట్టుకునే వారి పింఛన్లను నిలిపివేసిన జగన్ ప్రభుత్వానికి డప్పులు, చప్పట్లు కొట్టే అర్హత లేదన్నారు.

డప్పులు, చప్పట్లు కొట్టే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు
డప్పులు, చప్పట్లు కొట్టే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు

By

Published : Oct 2, 2020, 10:51 PM IST

డప్పులు, చప్పట్లు కొట్టే అర్హత వైకాపా ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు లేదని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. చర్మకారులు, చెప్పులు కుట్టుకునేవారు, డప్పు కొట్టుకునే వారి పింఛన్లను జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆక్షేపించారు. అధికారం ఉన్నంత కాలం చంద్రబాబు చుట్టూ తిరిగిన జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్యవరప్రసాద్​లు ఇప్పుడు కులాన్ని అడ్డుపెట్టుకొని ఎదగాలని చూస్తున్నారని జవహర్ ధ్వజమెత్తారు. తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీలకు న్యాయస్థానాలే రక్షణ కల్పిస్తున్న విషయం డొక్కా తెలుసుకోవాలని హితవు పలికారు.

వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలి..

వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. విజయవాడలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 'వాలంటీర్లు మహిళలను వేధిస్తున్నారని చప్పట్లు కొట్టాలా... మహిళలపై అత్యాచారాలు చేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా ' అని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదీచదవండి

సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై సీఎం ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details