ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP leaders: స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలపై... తెదేపా నేతల ఆగ్రహం - ఏపీ తాజా వార్తలు

TDP leaders: స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. త‌ప్పులు అనే రోగాలతో.. తీవ్ర అనారోగ్యంతో కుంగి కృశించి.. అప్పుల‌నే వెంటిలేట‌ర్‌పై ఉందని.. ఏ క్షణ‌మైనా వెంటిలేట‌ర్ తీసేయొచ్చని ఎద్దేవా చేశారు.

TDP leaders
స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెదేపా నేతల ఆగ్రహం

By

Published : May 16, 2022, 1:57 PM IST

TDP leaders: స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. గౌర‌వ‌నీయ‌మైన స్పీక‌ర్ హోదాను మాట‌ల‌తోనూ, చేత‌ల‌తోనూ అత్యంత అగౌర‌వంగా మార్చేసిన ఘనత తమ్మినేనిదేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. త‌ప్పుల‌నే తీవ్ర అనారోగ్యంతో కుంగి కృశించి.. అప్పుల‌నే వెంటిలేట‌ర్‌పై ప్రభుత్వం ఉందని.. ఏ క్షణ‌మైనా వెంటిలేట‌ర్ తీసేయొచ్చని ఎద్దేవా చేశారు. గత తెదేపా ప్రభుత్వం నరేగా నిధుల‌తో అభివృద్ధి చేసిన శ్మశానంలో అన్ని ఏర్పాట్లూ చ‌క్కగా చేసి పెట్టామని.. జ‌గ‌న్ స‌ర్కారుకి త‌ల‌కొరివి పెట్టేందుకు జ‌నం ఉవ్విళ్లూరుతున్నారని అయ్యన్న దుయ్యబట్టారు.

తమ నాయకుడు చంద్రబాబు సమర్ధుడు కాబట్టే మూడు సార్లు సీఎం అయ్యారని తెలుగు మహిళ అధ్యక్షరాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముదిగొండ మారణ హోమంలో ఏడుగురు రైతులను కాల్చి చంపింది వైఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీసీ, మైనారిటీలకు ఒక్క రూపాయి అన్నా ఇచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన స్పందన చూసాక వైకాపా నాయకులకు మైండ్ సరిగా పని చేయడం లేదని విమర్శించారు. లండన్ మందులు కాకపోయినా కనీసం వారికి ఉచిత కోటాలో వచ్చేవైనా వాడటం మంచిదని అనిత ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details