ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తగదు: తెదేపా నేతలు - కొల్లు రవీంద్ర అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం వార్తలు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌ను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు చర్యలతో పాలనను పక్కదారి పట్టించారని విమర్శించారు. బీసీలను అణగదొక్కే విధంగా జగన్ పాలన సాగుతోందని మండిపడ్డారు.

tdp-leaders-about-kollu-ravindra-arrest
వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు

By

Published : Jul 4, 2020, 12:04 PM IST

Updated : Jul 4, 2020, 1:41 PM IST

మాజీ మంత్రి, బీసీ నేత కొల్లు రవీంద్ర అరెస్టును తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ఖండించారు. అధికారంలో ఉన్నామని మాజీ మంత్రులను బుక్ చేయాలని ప్రభుత్వం భావిస్తే అక్రమ కేసులు పెట్టడం పెద్దపని కాదని సోమిరెడ్డి అన్నారు. ఈఎస్ఐ కేసు అయినా మోకా భాస్కర్ హత్య కేసులో అయినా ఇంకే కేసులో అయినా.. అరెస్ట్ అయిన వారిపై పోలీసులు ఒత్తిడి తెచ్చి ఏ సంబంధం లేని తెదేపా నేతల పేర్లు చెప్పించి ఇరికించడం ఈ ప్రభుత్వంలో జరుగుతోందని మండిపడ్డారు.

అప్రజాస్వామికం

రాజకీయకక్షతో తెదేపా నేతలపై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, జగన్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

బీసీలను అణగదొక్కుతున్నారు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌ను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. బీసీలను అణగదొక్కే విధంగా జగన్ పాలన సాగుతోందని డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. రాష్ట్రంలో బలమైన బీసీ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టే దుర్మార్గ ఎత్తుగడ సాగుతోందని ఆరోపించారు. ఇందుకు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టులే ఉదాహరణ అని పేర్కొన్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘటనలో మాజీమంత్రికి సంబంధమేంటంటూ ప్రశ్నించారు.

ఏడాదిలో ఏం చేశారు

అవినీతి, అక్రమ కేసులు తప్ప ఏడాదిలో వైకాపా ప్రభుత్వం సాధించేందేమిటని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలతో పాలనను పక్కదారి పట్టించారని విమర్శించారు. తెదేపాకు చెందిన బీసీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వీటన్నింటికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు.

ఇవీ చదవండి..

మచిలీపట్నం కోర్టుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

Last Updated : Jul 4, 2020, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details