ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yanamala: 'రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారు' - తెదేపా నేత యనమల వార్తలు

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని.. భవిష్యత్‌ అంధకారంలా కనిపిస్తోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు  అన్నారు. పారిశ్రామికవేత్తలు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. విశాఖ ఉక్కును అమ్మే హక్కు కేంద్రానికి లేదన్నారు.

tdp leader yanamala ramakrishnudu
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారు

By

Published : Jul 13, 2021, 7:52 PM IST

ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో సర్వనాశనం చేసిందని.. భవిష్యత్‌ అంధకారంలా కనిపిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(yanamala ramakrishnudu) అన్నారు. పారిశ్రామికవేత్తలు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదన్న యనమల.. యువతకు ఉద్యోగాలు(jobs) లేవన్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు(steel plant)ను అమ్మే హక్కు కేంద్రానికి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని యనమల మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం కేంద్రంతో లాలూచి పడుతున్నారని విమర్శలు సంధించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పలేకపోతున్న జగన్(jagan).. తెదేపా(tdp) హయాంలో చంద్రబాబు(chandrababu).. అప్పటి ప్రధాని వాజ్​పేయ్​తో చర్చలు జరిపి ప్రైవేటీకరణను ఆపగలిగారని యనమల గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరమైతే నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని.. 8500 మంది నిర్వాసితులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details