Political Issue in Nuziveedu: కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావును గృహనిర్బంధం చేశారు. నూజివీడు అభివృద్ధిపై తెదేపా, వైకాపా మధ్య 10రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
నూజివీడులో రాజకీయ రచ్చ.. తెదేపా నేత అరెస్టు, వైకాపా ఎమ్మెల్యే గృహనిర్బంధం - ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుని గృహ నిర్బంధం
16:08 March 19
నూజివీడులో కొనసాగుతున్న ఉద్రిక్తత...తెదేపా నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అరెస్ట్
గాంధీబొమ్మ కూడలిలో ఈ సాయంత్రం బహిరంగ చర్చకు రావాలంటూ పరస్పర సవాళ్లు విసురుకున్నారు. అయితే, బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా పట్టణంలో 144 సెక్షన్ విధించి 400 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారని శుక్రవారం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముద్దరబోయిన... చర్చకోసం గాంధీబొమ్మ కూడలికి రావడంతో ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి :