ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హనుమంతుని జన్మస్థలంపై తప్పుడు ఆధారాలు..: వేమూరి ఆనందసూర్య

హనుమంతుని జన్మస్థలంపై తప్పుడు లెక్కలు చూపించారంటూ తెదేపా నేత వేమూరి ఆనంద సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందానంద సరస్వతి ప్రశ్నలకు బదులివ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ శారదా పీఠం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోందని ఆరోపించారు.

tdp leader ananda surya on hanuman birth place
హనుమంతుని జన్మస్థలంపై తప్పుడు లెక్కలు

By

Published : Jun 7, 2021, 10:53 PM IST

అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలంపై, శారదా పీఠంపైన.. హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలకు తితిదే సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనందసూర్య డిమాండ్ చేశారు. హనుమంతుని జన్మస్థలంపై తప్పుడు ఆధారాలు చూపించారని మండిపడ్డారు.

హనుమంతుని జయంతి శ్రావణ మాసంలో ఆచరించాల్సి ఉండగా.. ఇప్పుడు ఎందుకు జరుపుతున్నారని నిలదీశారు. సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం తితిదే చేస్తోందని, గోవిందానంద సరస్వతి మాటలను సమర్థిస్తున్నామన్నారు. ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణం రాజు రవికుమార్ విశాఖ శారదా పీఠం తప్పుల్ని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. స్వరూపానంద స్వామి శారదా పీఠాన్ని రాజకీయ పీఠంగా మార్చారని ధ్వజమెత్తారు. రాజకీయ కేంద్రంగా శారద పీఠం వివాదాల్లో నిలుస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details