ఏప్రిల్ 14న వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారిస్తుందనే.. సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కరోనా వస్తుందని పర్యటన వాయిదా వేసుకుంటే.. అక్కడ ప్రచారం చేస్తున్న మంత్రులకు రాదా అంటూ ప్రశ్నించారు.
కరోనా వస్తుందని వెళ్లట్లేదా లేక బాబాయి హత్యపై ప్రజలు నిలదీస్తారని వెళ్లలేదా అని నిలదీశారు. వివేకా హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేయాలని లోకేశ్ విసిరిన సవాల్‌కు భయపడి వెళ్లడం లేదంటూ ధ్వజమెత్తారు. బాబాయిని చంపిందెవరో జగన్‌కు తెలుసని పులివెందుల ప్రజలు అంటున్నారని వర్ల రామయ్య అన్నారు.