న్యాయ వ్యవస్థపై ముఖ్యమంత్రికి ఉన్న వ్యతిరేక భావమే.. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష పడటమని తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు. అదృష్టం బాగుండి, న్యాయవ్యవస్థ దయతో అధికారులు జైలుశిక్ష తప్పించుకొని, సేవాశిక్షతో బయటపడ్డారని తెలిపారు. 8 మంది ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం శిక్షవేయడమనేది దేశ చరిత్రలో ఎన్నడూ లేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి అసమర్థతవల్లే ఐఏఎస్‌లకు శిక్షపడిందని పేర్కొన్నారు.
"ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష దేశ చరిత్రలో లేదు. న్యాయవ్యవస్థపై సీఎంకు ఉన్న వ్యతిరేకభావమే ఐఏఎస్‌లకు జైలుశిక్ష. న్యాయవ్యవస్థ దయతో అధికారులు జైలుశిక్ష తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ఐఏఎస్‌లకు శిక్షపడింది. సీఎం స్థానంలో ఇంకెవరు ఉన్నా రాజీనామా చేసి ఉండేవారు. ఐఏఎస్‌ల శిక్షకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేసేవారు." - వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు