తెదేపా హయాంలో టిడ్కో నిర్మించిన 7లక్షల ఇళ్లను.. విస్తీర్ణంతో సంబంధంలేకుండా పేదలకు ఉచితంగా అందచేయాలని తెదేపా అధికారప్రతినిధి మొహమ్మద్ నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆప్షన్ల పేరుతో వాలంటీర్ల ద్వారా ప్రజలను మోసగిస్తామంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ప్రజల సొమ్ముతో ఇస్తున్న ప్రకటనలు, బూటకపు ప్రచారాలను సీఎం జగన్ ప్రభుత్వం కట్టిపెట్టాలని నజీర్ హితవు పలికారు. ఇళ్ల స్థలాల కోసం పట్టా భూములు పంపిణీకి సంబంధించి భూ కొనుగోళ్లలో వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఎకరాకు 20 నుంచి 30లక్షల రూపాయల వరకు దోచేశారని ఆరోపించారు.