ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమూల్​ కోసమే.. సంగం డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారు: నక్కా ఆనంద్​ బాబు - విజయవాడ వార్తలు

లక్షల మంది పాడి రైతులకు మేలు చేస్తున్న సంగం డెయిరీని.. అమూల్​ సంస్థ కోసమే నిర్వీర్యం చేస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్​ బాబు ఆరోపించారు. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగా దుందుడుకు చర్యలకు దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

nakka ananad babu fired on cm jagan over sangam dairy
నక్కా ఆనంద్​ బాబు

By

Published : Apr 27, 2021, 4:54 PM IST

సంగం డెయిరీ ఆక్రమణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. అమూల్​కు మేలు చేసేందుకే న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా డెయిరీని ఆక్రమించే ప్రయత్నాలు ముమ్మరం చేశారని ధ్వజమెత్తారు.

సంగం డెయిరీ ఆస్తులను దొడ్డిదారిన అమూల్​కు అప్పగించే ప్రయత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి రైతులకు మేలు చేసే సంగం డెయిరీతో సీఎం జగన్​కు వచ్చిన నష్టమేంటని ఆనంద్​బాబు నిలదీశారు. రైతులకు మేలు చేసే సంస్థలను ప్రోత్సహించాల్సిందిపోయి.. లక్షలాది మంది రైతులకు ఉపయోగపడుతున్న డెయిరీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

లీటర్​ పాలకు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తానన్న వాగ్ధానం సీఎం విస్మరించినా.. సంగం డెయిరీ మాత్రం ధర పెంచి రైతులకు లబ్ధి చేకూర్చుతోందన్నారు.

ఇవీ చదవండి:సంగం డెయిరీ యాజమాన్యం బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details