పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తెదేపా నేతలు కోరారు. ఈ మేరకు తెదేపా నేతలు వర్ల రామయ్య, బొండా ఉమ, అశోక్ బాబు ఎస్ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి: తెదేపా నేతలు - tdp latest news
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తెదేపా నేతలు కలిశారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టో రద్దుకు ఆదేశాలివ్వడంపై ఎస్ఈసీని వివరణ అడగ్గా.. కోర్టుకు వెళ్లాలని సూచించినట్లు వర్ల రామయ్య తెలిపారు. ఫిర్యాదు మేరకు నిమ్మాడ ఘటనపై ప్రత్యేకాధికారితో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారని బొండా ఉమా వివరించారు.
ఇదీ చూడండి: నిమ్మగడ్డ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: పెద్దిరెడ్డి